మహ్మద్ షమీకి అరెస్ట్ వారెంట్.. 15 రోజుల్లో లొంగిపోకపోతే?

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (16:22 IST)
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీకి చుక్కెదురైంది. మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోల్‌కత్తాలోని అలిపోర్ కోర్టు షమీపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్‌కు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇద్దరు పదిహేను రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని అలిపోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
అంతేకాకుండా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 15 రోజులు గడువు ఇచ్చింది. ఒకవేళ ఈ 15 రోజుల సమయంలో కోర్టు ఎదుట హాజరుకాని పక్షంలో షమీ, అతని సోదరుడిని అరెస్ట్ చేయనున్నారు. 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ తరఫున షమీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వెస్టిండీస్ పర్యటనలో వున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు