నో బాల్ నేరం.. హర్షల్‌ను పక్కనబెట్టి.. అర్ష్‌దీప్ సింగ్‌ను అందుకే తీసుకున్నాం..

శుక్రవారం, 6 జనవరి 2023 (14:32 IST)
శ్రీలంకతో జరిగిన టీ-20లో భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇందుకు భారత బౌలర్లదే తప్పు. బౌలర్లు ఏకంగా ఏడు నో బాల్స్  వేయడంతో భారీ పరుగులు సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ మ్యాచ్‌లో ఐదు నో బాల్స్ వేశాడు. అందులో కుశాల్ మెండిస్‌కి హ్యాట్రిక్ నో బాల్స్ కూడా వున్నాయి. 
 
శివమ మావి, ఉమ్రాన్ మాలిక్ తలా ఒక నోబాల్ వేయడంతో భారత్ కష్టాల్లో పడింది. కానీ జట్టు ఓటమికి అర్ష్ దీప్ సింగ్‌ను నిందించేందుకు భారత టీ-20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిరాకరించాడు. 
 
నో బాల్ వేయడం నేరం అని పాండ్యా చెప్పాడు. జట్టు ప్రాథమిక తప్పిదాలు చేసిందని, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి వాటికి ఆస్కారం ఉండకూదని తెలిపాడు. పవర్‌ ప్లే లో బౌలింగ్, బ్యాటింగ్ రెండూ మమ్మల్ని ముంచేశాయని పాండ్యా తెలిపాడు. 
 
ఇంకా హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ సాధించిన అర్ష్‌దీప్ సింగ్.. హర్షల్ పటేల్ స్థానంలోజట్టులోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ కోసమే హర్షల్ పటేల్‌ను తప్పించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు