ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ : సూర్య ప్రతాపం.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?

ఆదివారం, 6 నవంబరు 2022 (15:36 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, ఆదివారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులుచేసింది. ఫలితంగా జింబాబ్వే జట్టు ముంగిట 186 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌‍తో వీరవిహారం చేశాడు. 25 బంతుల్లోనే 61 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డారు. 
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మకు ఆరంభంలో ఆశించిన ఫలితం రాలేదు. కెప్టెన్‌గా మరోమారు నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులకే ఔట్ అయ్యాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం దూకుడుగా ఆడి 51 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ 26 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. 
 
అయితే, హార్దిక్ పాండ్యాతో కలిసి సూర్యకుమార్ చెలరేగి ఆడాడు. 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఫలితంగా 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. ఆ తర్వాత 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు