ప్రపంచ కప్ 2023 పోటీల్లో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డును నెలకొల్పింది. వరుసగా ప్రత్యర్థి జట్లపై 350+ పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ ఫీట్ ఇప్పటివరకూ ఏ జట్టు చేయలేదు. పాకిస్తాన్ జట్టుపై 367 పరుగులు చేసిన ఆసీస్ నెదర్లాండ్ జట్టుపై 399 పరుగుల స్కోరు చేసింది. ఈరోజు ధర్మశాలలో న్యూజీలాండ్ జట్టుతో తలపడి ఏకంగా 388 భారీ స్కోరు చేసి రికార్డు సృష్టించింది. మొత్తమ్మీద తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటింగ్ అంటే ప్రత్యర్థి జట్టు గుండెల్లో దడ పుట్టించే రీతిలో భారీ స్కోర్లు చేస్తోంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా 6 మ్యాచులకు గాను ఐదింట గెలిచి అగ్రస్థానంలో వుంది. భారత్ 5 మ్యాచులకు గాను ఐదింటిలో గెలిచి రెండవ స్థానంలోనూ, న్యూజీలాండ్ ఆరు మ్యాచులకు రెండింటిలో పరాజయం పాలై 3వ స్థానంలో నిలిచింది. ఇక ఆస్ట్రేలియా 6 మ్యాచులకు గాను 2 మ్యాచుల్లో ఓడి నాలుగవ స్థానంలో వుంది.