ఆసీస్ ఓపెనర్లలో మిచెల్ మార్ష్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 46 పరుగులతో రాణించాడు. అతడు ఔట్ కావడానికి ముందు రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 7.6 ఓవర్‌లో కుల్దీప్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 15 బంతుల్లో ఒక సిక్స్ సాయంతో 28 పరుగులు చేశాడు. ట్రావిడ్ హెడ్ క్రీజులో ఉన్నంత వరకు దూకుడుగానే ఆడాడు. జోస్ ఇంగ్లిస్ 20 బంతుల్లో 20 రన్స్ చేశాడు.
ఇకపోతే, భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్‌లో రాణించిన హర్షిత్ రాణా.. బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరులో భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసుకున్నప్పటికీ ఆసీస్‌ను మాత్రం నిలువరించలేకపోయారు. ఫలితంగా ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.