స్వదేశంలో పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు ముందు.. భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే షమి, రహానే, రోహిత్ గాయాల కారణంగా జట్టుకు దూరమయిన విషయం తెలిసిందే. ఇపుడు చెన్నై టెస్టులో గాయపడిన అక్షర్ పటేల్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన జయంత్ యాదవ్ వన్డే, టీ-ట్వంటీ సిరీస్‌కు దూరమవనున్నాడు. అదేవిధంగా టెస్ట్ సిరీస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అశ్విన్, జడేజాలు వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి.
అశ్విన్, జడేజాలు మిస్ అయితే.. అమిత్ మిశ్రా స్పిన్ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్, మిగతా పార్ట్‌టైమ్ స్పిన్నర్లు మిశ్రాకు తోడుగా భారాన్ని పంచుకోనున్నారు. గాయం కారణంగా వన్డేలకు దూరమైన పేసర్ షమి స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకోనున్నట్టు తెలిసింది. కాగా, ఇంగ్లండ్‌తో జనవరి 15న నుంచి వన్డే సిరీస్ ఆరంభంకానుంది.