టీమిండియాకు స్ట్రిక్ట్ వార్నింగ్.. నచ్చకపోతే ఆడకండి..

సోమవారం, 4 జనవరి 2021 (21:36 IST)
టీమిండియాకు క్వీన్స్‌ట్యాండ్ షాడో హెల్త్ మినిస్టర్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించ కూడదని తేల్చి చెప్పారు. టీమిండియా ఆటగాళ్లు కరోనా నియమాలను పాటించాలని హెచ్చరించారు. నచ్చకపోతే అక్కడకు వచ్చి ఆడకండి.. అంతేకానీ కరోనా నిబంధనలను మాత్రం సులభం చేసేది లేదని తేల్చి చెప్పారు. ఆమె మాట్లాడుతున్న ఓ వీడియోను స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 
 
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ సిడ్నీలో జనవరి 7వ తేదీ నుంచి జరుగుతుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ క్వీన్స్‌ల్యాండ్‌ రాజధాని బ్రిస్బేన్‌లో జరగాల్సి ఉంది. అయితే ఉన్నట్లుండి సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్‌తో సరిహద్దులను మూసివేసింది. అయితే క్వీన్స్‌ట్యాండ్ షాడో హెల్త్ మినిస్టర్ వ్యాఖ్యల‌పై బీసీసీఐ చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు