బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్

మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:05 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షా ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చిన గంగూలీ... అనుమానంతో సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. 
 
ఇందులో కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని ఫుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారనీ, ఆయనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో కాంటాక్ట్ అయిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని బీసీసీఐ కోరింది. 
 
కాగా, ఈ యేడాది ఆరంభంలో గంగూలీ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు. ఇదిలావుంటే, గతంలో గంగూలీ కుటుంబ సభ్యులు సైతం ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఆయన సోదరుడు, తల్లి ఈ వైరస్‌కు చికిత్స తీసుకుని కోలుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు