ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ బీజేపీ విజయవాడలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజాగ్రహ సభ ఏర్పాటు పనులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యవేక్షించారు. ఈ నెల 28న సిద్దార్థ గ్రౌండ్లో నిర్వహించినున్న సభా నిర్వణకు అవసరమైన చర్యలపై చర్చించారు.
ప్రజాగ్రహ సభకు వచ్చే ప్రజలకు అవసరమైన సమాచారం ఇవ్వడం, వేదిక వద్ద ఏర్పాట్లుపై సోము వీర్రాజు పలు సూచనలు చేశారు. జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కో ఇన్ ఛార్జ్ సునీల్ దేవదర్ జీ ,
బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిట్ర శివన్నారాయణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెవైఎం రాష్ట్ర. అధ్యక్షుడు సురేంద్ర మోహన్, విజయవాడ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీ రాం తదితరులు సోమువీర్రాజు వెంట ఉన్నారు.