#U19WorldCup : రాహుల్ ద్రావిడ్ పంట పండింది

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (18:36 IST)
అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శనివారం జరిగిన ఫైనల్ పోరులో భారత యువ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడించి విశ్వవిజేతగా అవతరించారు. అదీకూడా వరుసగా నాలుగోసారి ప్రపంచ విజేతగా నిలించారు. దీంతో యువ భారత్‌ జట్టుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రంశసలు వెల్లువెత్తున్నాయి. 
 
ఈ శుభ తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కుర్రోళ్ళతో పాటు జట్టు కోచ్‌కు భారీ నజరానా ప్రకటించింది. విజేత జట్టు సభ్యులకు రూ.30 లక్షల చొప్పున నజరానా ప్రకటించిన బీసీసీఐ.. కోచ్ ద్రావిడ్‌కు రూ.50 లక్షలు, సహాయ బృందానికి రూ.20 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. 
 
కాగా, శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 216 పరుగులు చేసింది. ఆ తర్వాత 217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 38.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుని విశ్వ విజేతలుగా అవతరించారు. 
 
ఇక్కడ విచిత్రమేమింటే.. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌ను ఆసీస్‌తోనే మొదలుపెట్టి.. ప‌పువా న్యూ గినియా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ వంటి జట్లను చిత్తు చేసి... ఫైనల్‌లో మ‌ళ్లీ ఆస్ట్రేలియాతో తలపడి నాలుగోసారి వ‌ర‌ల్డ్‌క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. రాహుల్ ద్ర‌విడ్ కోచింగ్‌లో రాటుదేలిన పృథ్వి షా సేన‌.. నిజ‌మైన చాంపియ‌న్ టీమ్‌లాగే ఆడి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు