ఐపీఎల్‌ వేలం జరుగుతుంటే.. బాత్రూమ్‌లో కూర్చున్నా: నాగర్‌కోటి

సోమవారం, 29 జనవరి 2018 (18:13 IST)
కివీస్‌తో జరుగుతున్న అండర్-10 ద్వారా అందరినీ ఆకట్టుకున్న టీమిండియా ఆటగాడు నాగర్‌కోటికి ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడే అవకాశం వచ్చింది. నాగర్‌కోటిని వేలం ద్వారా సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 2018 ఐపీఎల్ వేలంలో నాగర్‌ కోటిని రూ.3.2కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కైవసం చేసుకుంది.

ఈ సందర్భంగా నాగర్‌కోటి మాట్లాడుతూ.. వేలం జరుగుతున్నప్పుడు కాస్త ఒత్తిడికి గురై.. బాత్రూమ్‌లో కూర్చున్నానని తెలిపాడు. స్నేహితులు ఫోన్లు చేసినా బయటకు రాలేదు. 
 
తనతో మాట్లాడేందుకు పంకజ్ యాదవ్ సోషల్ మీడియా ద్వారా లైవ్లోకి వచ్చినా నోరెత్తలేదని.. అందుబాటులోకి రాలేనని మెసేజ్ పెట్టానని నాగర్ కోటి చెప్పాడు. వేలం ముగిసిన తర్వాత తనతో పాటు కుటుంబసభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారన్నాడు. మైదానంలోకి ఒక్క ఐపీఎల్ మ్యాచే చూశాను.

అయితే ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించిందని.. ఇంకా టీవీ ద్వారా బిగ్‌బాష్‌ లీగ్‌లో క్రిస్‌ లిన్‌ బ్యాటింగ్‌ చూశానని తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్ ద్వారా అతనికి నెట్స్‌లో బంతులేసే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా వుందని చెప్పుకొచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు