యూసుఫ్ పఠాన్‌కు నిర్వహించిన డోప్ టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు. యూసఫ్ పఠాన్ టర్‌బ్యూటలైన్ పదార్థాన్ని తీసుకున్నాడని తేల్చి చెప్పింది. ఒకవేళ దగ్గు వంటి ఏదైనా ఆరోగ్య సమస్య ఉండి ఆటగాడు డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే అనుమతి తీసుకోవాలని, కానీ, యూసఫ్ పఠాన్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఈ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు సమాచారం.
కాగా, గతయేడాది డోపింగ్ ఆరోపణలు వచ్చి నేపథ్యంలో యూసఫ్ పఠాన్‌ను బీసీసీఐ తాత్కాలికంగా సస్పెండ్ చేయడంతో ఆయన రంజీ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఐదు నెలల నిషేధం మాత్రమే విధించింది.