అద్భుత ఫామ్‌లో డుప్లెసిస్.. 61 బంతుల్లో 92 పరుగులు

సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (19:18 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రారంభం అయ్యేందుకు ఇంకా అరవై రోజుల సమయం వుంది. ఈ లీగ్ ఆడనున్న చాలామంది స్టార్ బ్యాటర్లు ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 టోర్నమెంట్ ఆడుతున్నారు. వీరిలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఒకరు. 
 
తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ మిగతా ఐపీఎల్ జట్లకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5న ఆదివారం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ 7 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. తృటిలో రెండో సెంచరీని జారవిడుచుకున్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ 61 బంతులు ఎదుర్కుని 92 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో నమోదైన ఏకైక సెంచరీ ఇదే కావడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు