భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని వేవ్‌లు త‌ప్ప‌వు.. డబ్ల్యూహెచ్‌వో

శనివారం, 31 డిశెంబరు 2022 (19:17 IST)
చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 
 
భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని వేవ్‌లు త‌ప్ప‌వ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ఇప్పటికే 500కి పైగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయని పేర్కొంది.
 
చైనాలో తీవ్రస్థాయిలో కోవిడ్ విజృంభిస్తోంది. మున్ముందు మ‌రిన్ని వేవ్‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కొన్ని ఒమిక్రాన్ వేరియంట్లకు రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం వుండటం ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 
 
వీటిపై పోరాడేందుకు సరిపడా అస్త్రాలు వుండటం ఉపశమనం కలిగించే అంశం అంటూ డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌తినిధి మ‌రియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు