బాధ్యతల నుంచి తప్పుకోనున్న సౌరవ్ గంగూలీ

గురువారం, 18 ఏప్రియల్ 2019 (17:34 IST)
ఒకే అంశంపై పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుకున్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మూడేళ్లక్రితం సచిన్‌ టెండూల్కర్‌, గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌తో క్రికెట్‌ సలహాదారుల కమిటీ (సీఏసీ)ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇపుడు ఈ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. 
 
ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు గంగూలీ సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షునిగా ఉన్న గంగూలీ, ఢిల్లీ సలహాదారుగా ఎలా వ్యవహరిస్తాడంటూ ముగ్గురు క్రికెట్‌ అభిమానులు ఇటీవల బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై శనివారం బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ను కలిసి గంగూలీ వివరణ ఇవ్వనున్నాడు. 
 
అయితే.. క్యాబ్‌ చీఫ్‌, ఢిల్లీ సలహాదారు పదవులు ‘విరుద్ధ’ అంశం కిందకు రావని గంగూలీ అంటున్నాడు. మరోవైపు క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీవో ఏ) కూడా గంగూలీ అభిప్రాయాన్ని ఏకీభవించే అవకాశమున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కానీ, మున్ముందు తన సీఏసీ పదవిపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యే చాన్సుండడంతో తానే ఆ హోదా నుంచి తప్పుకోవాలని గంగూలీ భావిస్తున్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు