ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013 సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కారణంగా క్రికెటర్ శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. బీసీసీఐ తనపై విధించిన నిషేధంపై శ్రీశాంత్ సుప్రీంను ఆశ్రయించాడు. శ్రీశాంత్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది.
శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం చాలా కఠినమైనదిగా అభివర్ణించింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్ నిషేధంపై మరో నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది. సుప్రీం తీర్పుపై శ్రీశాంత్ స్పందిస్తూ.. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తనకు ఓ లైఫ్ లైన్ ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించిన తనకు త్వరలో టీమిండియా జట్టులో స్థానం దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇకపోతే.. టీమిండియా తరపున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ఇటీవల హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న శ్రీశాంత్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.