ఈ క్లబ్ ఎప్పటికప్పుడు ప్రత్యర్థి జట్లను తమ కామెంట్స్‌తో చికాకుపెడుతూ మానసికంగా దెబ్బతీస్తుంటుంది. ప్రస్తుతం ఈ క్లబ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, త్వరలో 2019 ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ వేసుకున్న జెర్సీపై ఆస్ట్రేలియాకు బదులుగా 'చీట్స్' అని మార్ఫింగ్ చేసిన 'బార్మీ ఆర్మీ'.. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన బెన్క్రాఫ్ట్ను గుర్తు చేస్తూ... కీలక బౌలర్లు మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ చేతుల్లో సాండ్ పేపర్ పట్టుకున్నట్టు ఫొటోలను క్రియేట్ చేసి ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేసింది.