వరల్డ్ కప్ పోటీలు.. ఐసీసీ గడువు.. జట్ల ఎంపిక కష్టమా.. ఎందుకని?

బుధవారం, 10 ఏప్రియల్ 2019 (11:35 IST)
ప్రపంచ కప్ పోటీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ పోటీలు జరుగుతున్న వేళ.. జట్టు ఎంపికకు ఐసీసీ గడువు ఇచ్చింది. ఏప్రిల్ 23 నుంచి ప్రపంచ కప్ పోటీల్లో ఆడే క్రికెట్ జట్లు తమ సభ్యులను ప్రకటించాల్సి వుంది. కానీ ఐపీఎల్ కారణంగా జట్టు సభ్యుల ఎంపిక కష్టతరమైందని ఆయా జట్టు యాజమాన్యాలు చెప్పడంతో ఐసీసీ.. మే 23వ తేదీ వరకు సమయం ఇచ్చింది. 
 
ఈలోపు ఆటగాళ్ల పేర్లను సిద్ధం చేసుకుని ఎలాంటి గాయాలూ లేకుండా సిద్ధం చేసుకోవాలని ఐసీసీ కోరింది. మే 30న టీమ్స్ ఈవెంట్ జరుగుతుంది. ఇప్పటివరకూ న్యూజిలాండ్ మాత్రమే తమ జట్టు సభ్యుల్ని ప్రకటించింది. ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా ఏప్రిల్ 15వ తేదీన జట్టు సభ్యులను ప్రకటించనుంది. 
 
భారత్‌తో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా కూడా తమ జట్టును ఎంపిక చేసే తేదీలను ప్రకటించాయి. సౌతాఫ్రికా ఏప్రిల్ 18న తమ జట్టును ప్రకటించనుంది. మే 12న క్యాంపును ప్రారంభించబోతోంది. 2017 ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన పాకిస్థాన్ ఏప్రిల్ 23న తమ జట్టును ప్రకటించనుంది. బంగ్లాదేశ్... ఏప్రిల్ 15 నుంచీ 20 మధ్య జట్టును ప్రకటిస్తుందని తెలిసింది. ఇక వరల్డ్ కప్‌ని నిర్వహించే ఇంగ్లాండ్... ఆతిథ్య జట్టును ప్రకటించలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు