తీవ్ర గుండెపోటుతో కుప్పకూలడంతో అంపైర్ సహా తోటి క్రీడాకారులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పద్మనాభ్ మరణించాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మంజేశ‍్వర పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బౌలింగ్ చేసేందుకు సిద్ధమైన పద్మనాథ్ గుండెపోటుతో కుప్పకూలడాన్ని ఓ న్యూస్ ఛానల్ ఫేస్‌బుక్ ఛానల్లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్‌లో వైరల్ అవుతోంది.