బుట్టబొమ్మ పాటకు భార్యతో స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్

గురువారం, 30 ఏప్రియల్ 2020 (14:30 IST)
Buttabomma Song
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలకు భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. సెలెబ్రిటీలు వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులకు టచ్‌లో వున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తనకు సంబంధించి అప్‌డేట్స్‌ని ప్రతీ రోజు అభిమానులతో పంచుకుంటున్నాడు. 
 
తాజాగా బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేశాడు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపురంలోని పాటలన్నీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుట్టబొమ్మ పాటకు డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి చేస్తున్న 'టిక్‌-టాక్' వీడియోలో అభిమానులను అలరిస్తున్నాయి. ఇటీవలే తన భార్యతో కలిసి ఫ్లిక్‌ ద స్విచ్ అనే ఛాలెంజ్‌ చేసిన విషయం తెలిసిందే.
 
తాజాగా, వార్నర్ మరో టిక్‌-టాక్‌లో తెలుగు క్రికెట్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. 'బుట్టబొమ్మ' పాటపై వార్నర్ తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ పాటలోని సిగ్నేచర్ స్టెప్‌ని వార్నర్‌, క్యాండీస్ కలిసి చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీలో వార్నర్ ఈ డ్యాన్స్ చేశాడు. కాగా, ఈ వీడియోపై అల్లు అర్జున్ స్పందించాడు. తన పాటకి డ్యాన్స్ చేసినందుకు అల్లు అర్జున్ ''థాంక్యూ'' అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 

#ButtaBomma breaks the border

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు