కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళలపై గృహ హింసలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్య కాఫీ పెట్టివ్వలేదని ఓ భర్త.. ఆమెపై వేడినీరు పోసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు శివారు ప్రాంతమైన తొట్టప్పళపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పారిశ్రామిక వేత్త భార్య కావ్య (34).