శవాల వరుసలు చూశా... భారత్‌లో దారుణ పరిస్థితులు : డేవిడ్ వార్నర్

బుధవారం, 2 జూన్ 2021 (12:59 IST)
ఐపీఎల్ 14వ సీజన్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా ఈ టోర్నీ వాయిదాపడింది. అయితే, భారత విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించడంతో డేవిడ్ వార్నర్ భారత్‌లో చిక్కుకునిపోయాడు. ఈ క్రమంలో భారత్‌లో కరోనా వైరస్ సాగించిన మారణహోమాన్ని ఆయన స్వయంగా చూశారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ షోలో వెల్లడించారు. 
 
భారత్‌లో క‌రోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉందన్నారు. అక్క‌డి ప‌రిస్థితులు త‌న‌ను క‌ల‌చివేసిన‌ట్లు చెప్పాడు. ఆక్సిజ‌న్ కోసం భాతీయులు అల్లాడిపోవ‌డం నేను చూశాను. అది అంద‌రినీ క‌ల‌చివేసింది. గ్రౌండ్ నుంచి హోట‌ల్‌కు వెళ్లి వ‌చ్చే స‌మ‌యాల్లో క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన త‌మ‌వాళ్ల‌కు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌డానికి కుటుంబ స‌భ్యులు వీధుల్లో లైన్లు క‌ట్ట‌డం కూడా నేను చూశాను. అది చాలా భ‌యాన‌కంగా అనిపించింది అని వార్న‌ర్ అన్నాడు. 
 
ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ను ర‌ద్దు చేయ‌డం స‌రైన నిర్ణ‌య‌మ‌ని అత‌డు అభిప్రాయ‌ప‌డ్డాడు. బ‌బుల్‌లోనూ కేసులు న‌మోదు అయిన త‌ర్వాత ప్లేయర్స్ అంతా అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని అనుకున్న‌ట్లు చెప్పాడు. ఇండియ‌న్స్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇది చాలా స‌వాలుతో కూడుకున్న‌ది. కేసులు న‌మోదైన త‌ర్వాత మేము సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాల‌ని చూశాం అని వార్న‌ర్ వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు