ఇప్పటికే దేశ ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ బారినపడిన అనేక వేల మంది మృత్యువాతపడుతున్నారు. ఈ వైరస్ నుంచి కోలుకోకముందే దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇందులో అనేక రకాలైన ఫంగస్ కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఎల్లో ఫంగస్ కేసు ఏపీలోని కర్నూలు జిల్లాలో నమోదైంది. ఇపుడు కొత్తగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు కొత్తగా నమోదైంది. కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ కేసు నమోదైంది. ఇది దేశంలో అలజడి రేపింది.
తలనొప్పి, వాంతులు బ్లాక్ ఫంగస్ యొక్క ప్రాథమిక లక్షణాలు కాగా.. మెదడులో వ్యాధి ముదిరితే రోగి సృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. సైనస్ ద్వారా ఈ బ్లాక్ ఫంగస్ మొదడుకు చేరే అవకాశముందని వైద్యులు అభిప్రాయపడ్డారు.