లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు దిగ్వేశ్ రాఠీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సస్పెండ్ చేసింది. ఐపీఎల్ పోటీల్లో భాగంగా, లక్నో సూపర్ కింగ్స్ స్పిన్ బౌలర్ దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగడమే దీనికి కారణం. వికెట్లు తీసిన అనంతరం హద్దులు దాటి సంబరాలు చేసుకున్నందుకుగాను ఇప్పటికే దిగ్వేశ్ రెండుసార్లు జరినామాకు గురయ్యాడు.
ఈ సీజన్‌లో మూడోసారి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించింనందుకుగాను దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ సస్పెండ్ చేసింది. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు లక్నో, గుజరాత్ జట్ల మధ్య ఈ నెల 22వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆడకుండా నిషేధం విధించింది. ఈ సీజన్‌లో దిగ్వేశ్ ఖాతాలో ప్రస్తుతం ఐదు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి.