విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌కు కారణం ఇదేనా... ??

ఠాగూర్

శుక్రవారం, 16 మే 2025 (19:40 IST)
భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. టెస్ట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్టు ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక ఉన్న కారణాలు ఇపుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో పలు రకాలైన వార్తా కథనాలు మీడియాలో వస్తున్నాయి. 
 
టెస్టుల్లో తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తామని కోహ్లీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) హామీ ఇచ్చిందనీ, వాస్తవ రూపంలో అలా జరగకపోవడంతో ఆయన ఆటకు వీడ్కోలు పలికినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మీడియా కథనాల మేరకు.. కోహ్లీకి మరోమారు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సమయంలో ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. ఆ సిరీస్‌లో టీం ఇండియా 3-1 తేడాతో ఓడిపోయింది. దీంతో కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ యూటర్న్ తీసుకుంది. యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్టు ఆ కథనాల్లో పేర్కొన్నారు. 
 
మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారన్న ఆశతోనే కోహ్లీ ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడాడని చెబుతున్నారు. ఆడిలైడ్ టెస్ట్ తర్వాత కెప్టెన్సీ విషయంలో అతడికి హింట్ ఇచ్చారని, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని అతడి సన్నిహితులు చెప్పినట్టు ఆయా కథనాల్లో రాసుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు