అయితే, గాయం కారణంగా మనీష్ పాండేను తొలగించి... తమిళనాడు వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌కు చోటు కల్పించారు. ఐపీఎల్-10లో గుజరాత్ లయన్స్ తరపున అతను 14 మ్యచ్‌ల్లో 361 పరుగులతో సత్తాచాటాడు. అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీ, దేవ్‌ధర్ ట్రోఫీ ఫైనల్స్‌లో సెంచరీలు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దేశవాళీ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న దినేశను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, తొలి మ్యాచ్‌ని జూన్ 4న పాకిస్థాన్‌తో ఆడాల్సి వుంది.