భద్రాచలంలో దారుణం- ఆటోలో ఎక్కిన 17ఏళ్ల బాలికపై మత్తు మందిచ్చి?

సెల్వి

సోమవారం, 25 ఆగస్టు 2025 (18:49 IST)
భద్రాచలంలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళగా పోలీసులు గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. ఆ బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం చర్ల మండల కేంద్రానికి వచ్చింది. అక్కడ వాజేడు ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ సమయంలోనే ఆటోలో ఉన్న ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్‌డ్రింగ్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. 
 
ఆపై వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. స్థానికులు బాధితురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఆ బాలిక శరీరంపై పంటిగాట్లు, గాయాలు ఉన్నాయని గుర్తించి  అత్యాచారం కేసు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు