ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో సెంచరీతో ఆదుకున్నాడు. 98 పరుగులకే టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన రిషభ్ పంత్.. సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డే రేంజ్‌లో ఆడాడు.
తద్వారా అత్యంత వేగవంతమైన టెస్ట్ సెంచరీని, ఒక భారత వికెట్ కీపర్ చేసిన వేగవంతమైన టెస్ట్ సెంచరీ, ఇంగ్లాండ్‌లో భారతదేశం తరఫున రెండవ వేగవంతమైన టెస్ట్ సెంచరీని సాధించిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు.
జట్టు స్కోరు 320 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆరో వికెట్‌గా రిషభ్ పంత్ వెనుదిరిగాడు. 19 ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 146 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 83, మహ్మద్ షమీ-0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు జడేజా కూడా సెంచరీ పూర్తి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.