క్రికెట్ ఆటలో ఫిక్సింగ్ నేరగాళ్ల పనిపట్టేందుకు సమగ్ర చట్టాలు అందుబాటులో లేవని అందుకే కఠిన చట్టాలు తప్పనిసరి చేయాలనే ఉద్దేశంతో మూడు ప్రైవేట్‌మెంబర్స్ బిల్లుల్ని ప్రవేశపెట్టినట్లు బీసీసీఐ కార్యదర్శి, ఎంపీ అయిన అనురాగ్ ఠాకూర్ తెలిపారు. లోక్‌సభలో మ్యాచ్ ఫిక్సింగ్ నేరాలను అరికట్టేందుకు మూడు ప్రైవేట్ మెంబర్స్ బిల్లుల్ని ఆయన ప్రవేశపెట్టారు.
ఈ క్రమంలో జాతీయ స్పోర్ట్స్ ఎథిక్స్ కమిషన్ బిల్లును క్రీడల్లో నెలకొన్న వివిధ రకాల నేరాలను అరికడుతుందని ఠాకూర్ తెలిపారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ వంటి నేరాలకు పదేళ్ల పాటు జైలు శిక్ష పడేట్లు ప్రతిపాదించే ఛాన్సుంది. 2013లో ఐపీఎల్‌ను ఫిక్సింగ్ భూతం కుదిపేసింది. క్రికెటర్లు చండేలా, అంకిత్ చవాన్, శ్రీశాంత్‌లు జైలుకు కూడా వెళ్ళొచ్చారు.