ఊపిరి ఉంటే ఉప్పుగల్లు అమ్ముకుంటాం.. ఇక పాకిస్థాన్‌లో అడుగుపెట్టం... విదేశీ క్రికెటర్లు

ఠాగూర్

ఆదివారం, 11 మే 2025 (09:42 IST)
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పాల్గొన్న విదేశీ క్రికెటర్లు మృత్యు అంచులకు వెళ్లి వచ్చారు. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలుకావడం, పాక్‌లోని పలు ముఖ్య నగరాలపై భారత్ భీకర దాడులకు తెగబడటంతో విదేశీ క్రికెటర్లు ప్రాణభయంతో వణికిపోయారు. తాము క్షేమంగా ఇంటికి వెళతామో లేదో అని వారు బోరున విలపించారు. ఈ విషయాన్ని పలువురు విదేశీ క్రికెటర్లు స్వయంగా వెల్లడించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐపీఎల్ తరహాలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా పీఎస్ఎల్ పోటీలను నిర్వహిస్తుంది. ఇందులో పలువురు విదేశీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఇలాంటి వారిలో రషీద్ హుస్సేన్, డారెల్ మిచెల్, సామ్ బిల్లింగ్స్, కుశాల్ పెరీరా, డేవిడ్ వైట్, టామ్ కర్రస్ ఇలా అనేక మంది క్రికెటర్లు ఉన్నారు. అయితే, భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పీఎస్ఎల్‌ను రద్దు చేశారు. దీంతో చాలా మంది క్రికెటర్లు తమ దేశాలకు బయలుదేరి వెళ్లారు. 
 
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ వెళ్లేందుకు దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్న రషీద్ హుస్సేన్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ, పాకిస్థాన్‌లో విదేశీ క్రికెటర్లు ఎదుర్కొన్న భయాందోళనల గురించి వివరించారు. పీఎస్ఎల్‌లో అడుగుతున్న విదేశీ ఆటగాళ్లందరూ చాలా భయపడ్డారని ఆయన తెలిపారు. 
 
జీవితంలో ఇకెంపుడూ పాకిస్థాన్‌ వెళ్లబోనని డారెల్ మిచెల్ తనతో అన్నట్టు రషీద్ వెల్లడించారు. టార్ కర్రీస్ అయితే, ఇంటికి క్షేమంగా చేరుకుంటానో లేదోనని తీవ్రంగా భయపడటంతోపాటు బోరున విపించాడు. దీంతో అతన్ని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. తమ కుటుంబాలు చాలా ఆందోళన చెందాయని, దేవుడు దయ వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని రషీద్ వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు