పైగా, ఆ దేశం కూడా ఆర్థిక కష్టాల్లో చిక్కుకునివుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అంపైర్ ఎలైట్ జాబితాలో ఒకపుడు అగ్రగామి అంపైర్‌గా సేవలు అందించి అసద్ రవుఫ్ ఇపుడు బతుకుదెరువుకోసం చెప్పులు అమ్ముకుంటున్నారు. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో బట్టలు చెప్పుల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
ఈయన గత 2000 నుంచి 2013 మధ్య కాలంలో 49 టెస్ట్ మ్యాచ్‌లకు, 98 వన్డేలకు, 23 టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగిజారిపోతూ వచ్చింది. దీనికితోడు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకున్నారు. దీంతో బతుకుదెరువు కోసం గత 2022 నుంచి ఆయన లాహోర్‌లో చెప్పులు, బట్టల దుకాణం నడుపుతున్నారు.
తన పరిస్థితిపై అంపైర్ అసద్ రవుఫ్ మాట్లాడుతూ, 'నేను నా కెరీర్‌లో చాలా మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశాను. ఇక నేను అక్కడ కొత్తగా చూడాల్సిందేమీ లేదు. 2013 నుంచి నేను మళ్లీ ఆ వైపు చూడలేదు. ఎందుకంటే నేనొక్కదానిని వదిలిపెడితే మళ్లీ జీవితంలో దాని ముఖం చూడను" అని వ్యాఖ్యానించారు.