2027 ప్రపంచ కప్‌కు దూరంగా ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లు : గవాస్కర్

ఠాగూర్

మంగళవారం, 13 మే 2025 (15:15 IST)
భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో 2027లో జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. కోహ్లీ, రోహిత్ శర్మలిద్దరూ వచ్చే 2027లో జరిగే ప్రపంచ కప్ ఆడరని జోస్యం చెప్పారు. ఈ ఇద్దరు క్రికెటర్లకు ఇది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.  
 
రోహిత్, కోహ్లీ వన్డేల్లో అద్భుతంగా ఆడతారు. 2027 వరల్డ్ కప్ విషయానికి వస్తే, అప్పటికీ వీరిద్దరిలో ఇప్పటిలానే దూకుడుగా, నిలకడగా ఆడే సత్తా ఉంటుందా? అని జాతీయ సెలక్షన్ కమిటీ ఆలోచన చేస్తుంది. వారిద్దరూ ఆడగలరు అని అనుకుంటేనే వారు 2027 వరల్డ్ కప్‌లో ఆడుతారని, లేనిపక్షంలో వరల్డ్ కప్‌కు దూరమవుతారన్నారు. 
 
అయితే, తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం మరోలా ఉంటుందన్నారు. నిజాయితీగా చెప్పాలి అంటే నా అంచనా ప్రకారం రోహిత్, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడలేరు. కానీ, ఎవరికి తెలుసు.. ఒకవేళ బాగా ఆడుతూ అప్పటికీ కూడా సెంచరీలు మీద సెంచరీలు చేస్తే మాత్రం వారిని ఆ భగవంతుడు కూడా టీమ్ నుంచి తొలగించలేరు" అని సునీల్ గవాస్కర్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు