చాంపియన్స్‌గా టీమిండియా.. సునీల్ గవాస్కర్ ఆనంద తాండవం (Video)

ఠాగూర్

సోమవారం, 10 మార్చి 2025 (10:31 IST)
దాదాపు 12 యేళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలించింది. ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును ఓడించి చాంపియన్స్‌గా నిలిచింది. ఈ విజయం యావత్ భారతీయులను పులకింపజేసింది. కోట్లాది మంది క్రికెట్ అభిమానులను సంతోష సాగరంలో ముంచెత్తింది. 
 
క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అయితే ఏకంగా స్టేడియంల్ డ్యాన్స్ చేశారు. 75 యేళ్ల వయసులో మైదానంలో ఆయన పట్టలేనంత ఉత్సాహంతో నృత్యం చేస్తూ టీమిండియా విజయాన్ని ఆస్వాదించారు. ఆదివారం గెలిచిన జట్టులో కూడా ఒక సభ్యుడే అన్నంత జోష్‌ గవాస్కర్ ప్రతి చర్యలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ : న్యూజిలాండ్‌‍పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ 
 
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో టీమిండియా విజయం సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో 12 యేళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆరు బంతుల్లో మిగిలివుండగానే ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
కెప్టెన్ రోహిత్ శర్మ (76) కెప్టెన్ ఇన్నింగ్స్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు చేసి తీవ్ర నిరాశపరిచాడు. శ్రేయాస్ అయ్యర్ 48, కేఎల్ రాహుల్ 34, శుభమన్ గిల్ 31, అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్యా 18, రవీంద్ర జడేజా (9 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడం మూడోసారి. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా 2013లో ఇంగ్లండ్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 63, బ్రాస్‌వెల్ 53 పరుగులతో రాణించారు. రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 ఫర్వాలేదనిపించారు. విల్ యంగ్ 15, కేన్ విలియమ్సన్ 11, టామ్ లేథమ్ 14, మిచెల్ శాంట్నర్ 8 పరుగులు చేశారు. నాథన్ స్మిత్ ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ పడగొట్టారు. 

 

75 YEAR OLD SUNIL GAVASKAR DANCING ON INDIA'S VICTORY. ❤️pic.twitter.com/IS95b5Vhj8

— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు