దీంతో.. 192 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన యువరాజ్ సింగ్.. 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో మొత్తం 35 పరుగులు సాధించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలి బ్యాటింగ్ చేసిన ఎడ్మోంటన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
బెన్ కటింగ్ 43, షదాబ్ ఖాన్ 36, డుప్లెసిస్ 28 పరుగులు చేశారు. 192 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన టొరంటో నేషనల్స్ జట్టు 17.5 ఓవర్లలోనే ఛేదించింది. యువరాజ్ సింగ్ (35) మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ క్లాసెన్ 45, యువరాజ్ 35 పరుగులు చేశారు. మన్‌ప్రీత్ గోనీ (33) మెరుపులు మెరిపించి జట్టును విజయం సంపాదించిపెట్టాడు.