2011లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన అరుదైన రికార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ బ్రేక్ చేశాడు. అప్పట్లో ఆల్‌రౌండర్‌గా యువీ ఓ మ్యాచ్‌లో 50 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి రికార్డు నెలకొల్పగా, దాన్ని సోమవారం హసన్ అధిగమించాడు.
69 బంతుల్లో 51 పరుగులు సాధించడంతో పాటు, 10 ఓవర్లు బౌలింగ్ చేసి, 29 పరుగులు మాత్రమే ఇచ్చి, ఐదు వికెట్లు తీశాడు. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో షకీబుల్ పేరిట మరిన్ని రికార్డులు నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తరఫున ప్రపంచక్‌పలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్ షకీబల్ హసన్ నిలిచాడు. అలాగే ఈ వరల్డ్‌కప్‌లో వార్నర్ (447)ను వెనక్కినెట్టి అత్యధిక పరుగులు (476) సాధించిన ఆటగాడిగానూ రాణించాడు. వీటితో పాటు ప్రపంచకప్ మ్యాచ్‌లో 50కి పైబడిన స్కోరును సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు.
ఇకపోతే.. షకీబ్ ఆల్‌రౌండ్ షోతో ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మాజీ చాంపియన్లను మించిపోయింది. సఫారీ కంటే ఎన్నో రెట్లు ముందుంది. ఆడుతున్న పది జట్లలో సగం జట్లను కిందికి దించేసింది. టోర్నీ ఆరంభం నుంచి సెమీస్ రేసులో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ తర్వాతి స్థానం ఇప్పుడు బంగ్లాదేశ్‌దే కావడం విశేషం. పాయింట్ల పట్టికలో బంగ్లా తర్వాతే మాజీ చాంపియన్లు శ్రీలంక, పాక్, వెస్టిండీస్‌లు కొనసాగుతున్నాయి.