భారత క్రికెట్ జట్టులో టర్బోనేటర్‌గా గుర్తింపు పొందిన హర్భజన్ సింగ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. అన్ని ఫార్మెట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన శుక్రవారం ప్రకటించారు. దీంతో 23 యేళ్ల హర్భజన్ సింగ్ క్రికెట్ కెరీర్ ముగిసింది. ఈ సుధీర్ఘకాలంలో తనకు అన్ని విధాలుగా సహకరించి, ఆదరించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు. ఈ మేరకు భజ్జీ తన ట్వటిర్ ఖాతాలో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
కాగా, భజ్జీ మొత్తం 367 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 711 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో రెండు టెస్టుల్లో రెండు సెంచరీలను కూడా కూడా చేశారు. భారత క్రికెట్ జట్టుతోపాటు ఐపీఎల్ టోర్నీ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన భజ్జీ.. ఐపీఎల్‌లో ఆడుతాడా లేదా అన్నది తెలియాల్సివుంది.