క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సంచలన కామెంట్స్ చేసింది. మహ్మద్ షమీతో పాటు ఆతని కుటుంబీకులపై గృహ హింస కేసులు పెట్టిన హసీన్ జహాన్.. తాజాగా కథువా బాధితురాలి కోసం ఓ ఎన్జీవో సంస్థ నిర్వహించిన ర్యాలీలో పాల్గొంది. ఈ సందర్భంగా హసీన్ జహాన్ మాట్లాడుతూ.. కథువా బాదితురాలి ఘటనలో ఏం జరిగిందో అదే తన జీవితంలోనూ దాదాపు జరిగిపోయిందని.. అయితే కథువా బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని... కానీ తాను మాత్రం బతికి వున్నానని చెప్పుకొచ్చింది.
తనపై అత్యాచారం చేసేందుకు షమీ కుటుంబీకులు ప్రయత్నించారని.. అంతేగాకుండా తనను హతమార్చి.. చెత్తకుండీలో పడేయాలని చూశారని చెప్పింది. రెండు నెలల పాటు షమీ ఇంట్లో పోరాడి ప్రాణాలతో బతికి బయట పడ్డానని జహాన్ మీడియా ముందు తెలిపింది. ఇక షమీ నుంచి తనకు భరణంగా నెలకు పది లక్షల రూపాయలు కావాలని హసీన్ జహాన్ డిమాండ్ చేసింది. తన బిడ్డ బాగోగులు చూసేందుకు ఈ మొత్తం కావాల్సిందేనని హసీన్ జహాన్ చెప్పింది. ఐపీఎల్‌లో మహ్మద్ షమీ ఆడే మ్యాచ్‌లను చూడటాన్ని ఆపేశానని హసీన్ జహాన్ తెలిపింది.