ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో విహారి ఆడకపోవడం వల్ల అతడు సెలెక్టర్ల దృష్టిలో పడలేదన్నారు. ఇటీవలి కాలంలో ఐపీఎల్‌లోని ప్రదర్శనలు జాతీయ జట్టులో ఎంపికలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. నవంబర్ 25 నుంచి కివీస్‌తో జరిగే రెండు టెస్టులకు ఇటీవలే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. విహారిని ఎంపిక చేయకపోవడం పట్ల సెలెక్టర్లపై అనేక విమర్శలు వచ్చాయి.
'నిజాయితీగా చెప్పాలంటే హనుమ విహారిని ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. అతడు గత మూడు, నాలుగు నెలల్లో ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్‌లో కూడా ఆడలేదు. కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు కొంతకాలంగా క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లు ఎంపిక కావడానికి ఇదే కారణం కావొచ్చు.' అని గావస్కర్ అభిప్రాయపడ్డారు.