ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోహ్లీ సేన ఇప్పటికే 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో డిసెంబరు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య చివరి టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆసీస్ రికార్డును సమం చేయాలని భావిస్తోంది.
ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా ఉంది. 2005-2008 మధ్య ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తే ఆస్ట్రేలియా రికార్డును సమం చేసినట్టు అవుతుంది.
వ్యక్తిగతంగా కోహ్లీ కూడా మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. టెస్టు క్రికెట్లో కోహ్లీ 5వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ టెస్టులో ఆ పరుగులు పూర్తి చేస్తే భారత్ తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన 11వ ఆటగాడు అవుతాడు. ఇప్పటివరకు కోహ్లీ 62 టెస్టుల్లో 104 ఇన్నింగ్స్‌ల ద్వారా 4,975 పరుగులు సాధించాడు.