శ్రీలంకతో తొలి వన్డే: 67 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

మంగళవారం, 10 జనవరి 2023 (22:44 IST)
శ్రీలంక క్రికెట్ జట్టు భారత పర్యటనలో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో షనక నేతృత్వంలోని శ్రీలంక జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లు ముగిసే సరికి 373 పరుగులు చేసి శ్రీలంకకు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (113) సెంచరీ సాధించగా, కెప్టెన్ రోహిత్ శర్మ 83, శుభ్ మాన్ గిల్ 70 పరుగులు చేశారు. 
 
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.  
 
శ్రీలంక ఆటగాళ్లలో నిశాంక 72, అసలంగ 23, సిల్వా 47, షనక 102, హజరంగ 16 పరుగులు సాధించారు. భారత జట్టు తరఫున స్యామీ, పాండ్యా, చాహల్ తలో వికెట్ తీశారు. సిరాజ్ 2 వికెట్లు, మాలిక్ 3 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 12న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు