ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడు శంకర్ మిశ్రాను శనివారం ఉదయం బెంగళూరులో అరెస్టు చేశారు. అంతకుముందు అతడు పనిచేసే కంపెనీ వెల్స్ ఫార్గో నుండి శుక్రవారం తొలగించబడ్డాడు. బెంగళూరు నుంచి అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చిన మిశ్రా గత నవంబర్‌లో న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి ఎయిరిండియా విమానంలో వెళుతుండగా, ఈ ఘటన జరిగింది.
శంకర్ మిశ్రా, వెల్స్ ఫార్గో చేత తొలగించబడటానికి ముందు, ముంబైలోని దాని కార్యాలయంలో ఆపరేషన్స్ (భారతదేశం) వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అతను ముంబై నివాసి. కమ్‌గర్ నగర్‌కు చెందిన వాడు. ముంబైలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయం అయిన ఎస్వీకేఎమ్, మర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (NMIMS)పూర్వ విద్యార్థి కావడం గమనార్హం.
తాజాగా మిశ్రాతో కలిసి విమానంలో జర్నీ చేసినా భట్టాఛార్జీ ఈ ఘటనపై వివరించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. నిందితుడైన శంకర్ మిశ్రా నాలుగు సార్లు డ్రింక్స్ చేశాడని.. అడిగిన ప్రశ్నను పదే పదే అడిగాడని.. సిబ్బందిని పిలిచి మిశ్రా తీరు బాగోలేదని చెప్పినట్లు వెల్లడించారు. సీటు మార్చాలని కోరినా జరగలేదని వాపోయారు.