ప్రపంచవ్యాప్తంగా 10 వేల గంటలు లైవ్ కవరేజీ చేసినట్టు తెలిపింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీస్‌ను అత్యధికమంది వీక్షించగా ఇప్పుడా రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌ను 60 శాతం ఎక్కువ మంది వీక్షించారు. ఐసీసీ సామాజిక మాధ్యమాల ద్వారానూ అత్యధికమంది తిలకించారు. 618 మిలియన్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించినట్టు ఐసీసీ వివరించింది.
పాకిస్థాన్‌లో పీటీవీ, ఏఆర్వై, టెన్‌స్పోర్ట్స్‌లు ప్రసారం చేయగా 7.3 శాతం మంది అధికంగా వీక్షించారు. ఆస్ట్రేలియాలో అయితే ఫాక్స్ నెట్‌వర్క్‌లో ఏకంగా 175 శాతం అధిక వీక్షణలు లభించినట్టు ఐసీసీ వివరించింది.
అమెరికాలోనూ ఈ మ్యాచ్‌కు విశేష ఆదరణ లభించింది. ఈఎస్‌పీఎన్‌లో ప్రసారమైన భారత్-పాక్ మ్యాచ్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా చూశారు. ఫేస్‌బుక్‌లోనూ ఈ లీగ్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో 3.6 బిలియన్ వ్యూస్ లభించగా, ఈ మ్యాచ్ ఆ రికార్డును బద్దలు చేస్తూ 4.3 బిలియన్ వ్యూస్ దక్కించుకుంది.