భారత యువ క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. అండర్-19 వరల్డ్ కప్‌ను మరోమారు తమ వశం చేసుకున్నారు. ది ఓవెల్ మైదానంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన తుది పోరులో నాలుగోసారి విశ్వవిజేతలుగా నిలిచారు. 217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత యువ జట్టు... కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకున్నారు.
ఇషాన్ పోరెల్, నగర్‌కోటి, అనుకూల్‌రాయ్, శివ సింగ్ తలా నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఒక దశలో 134 పరుగులకే 3 వికెట్లతో ఉన్న ఆసీస్.. 82 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా చివరి పది ఓవర్లలో ఆసీస్‌ను భారత బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు.
కాగా, ఈ విజయంతో భారత్ ఖాతాలో నాలుగో సారి ప్రపంచకప్ చేరింది. దీంతో అత్యధిక ప్రపంచకప్‌లు నెగ్గిన జట్టుగా భారత్ అవతరించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సత్తా చాటింది. భారత యువ జట్టుకు క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న విషయం తెల్సిందే.