ఇంగ్లండ్ ఓపెనర్లు రోరీ బర్స్న్, డొమినిక్ సిబ్లి ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా టీమిండియా మరోసారి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టింది. అతని స్థానంలో నదీష్ షాబాద్‌ను టీంలోకి తీసుకుంది.
అంతకుముందు.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా జట్టులోకి నదీమ్, సుందర్‌లు వచ్చారు. ఆస్ట్రేలియా టూర్‌లో జరిగిన చివరి మూడు టెస్టులకు కెప్టెన్సీ నుంచి దూరమైన కోహ్లీ.. మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. జో రూట్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు బరిలోకి దిగనుంది. ఇక టీం ఇండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతోంది.
టీమిండియా జట్టు వివరాలు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానే, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్‌గిల్, అశ్విన్, పుజారా, బుమ్రా, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, నదీమ్
ఇంగ్లాండ్ : జో రూట్ (కెప్టెన్), లారెన్స్, సిబ్లి, స్టోక్స్, బర్న్స్, బట్లర్, పొప్, ఆర్చర్, ఆండర్సన్, బెస్, లీచ్