ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో తొలి రెండు టెస్టులకు అత్యుత్తమ జట్లను ఎంపిక చేయలేదని ఇప్పటికే ఇంగ్లండ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలే గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. 23ఏండ్ల జాక్ క్రాలే కుడి మణికట్టుకు గాయం కావడంతో చెన్నై వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది.