గత వైకాపా ప్రభుత్వ హయాంలో "ఆడుదాం ఆంధ్రా" పేరుతో రూ.కోట్ల అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి, వైకాపా మహిళా నేత ఆర్కే రోజా త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని ఏఫీ శాఫ్ చైర్మన్ అనిమిని రవి నాయుడు అన్నారు. గతంలో ఆమె క్రీడాశాఖామంత్రిగా పని చేశారని, ఆ సమయంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై విచారణ జరుగుతోందన్నారు. తన అంచనా మేరకు ఆగస్టు 15వ తేదీలోపు రోజా జైలుకెళ్లక తప్పదని ఆమె అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందన్నారు. రోజా రోజులు లెక్కబెట్టుకోవాలని రాయుడు వ్యాఖ్యానించారు.
ఏపీ రాష్ట్ర క్రీడా మంత్రిగా ఒక్క స్టేడియం అయినా నిర్మించారా? అని అని ఆయన ప్రశ్నించారు. రోజా నిత్యం చెన్నైలో ఉంటున్నారని, ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ నాయుడుపై ఆమె చేసిన వ్యాఖ్యలు క్షమించరానివన్నారు. ధైర్యం ఉంటే భాను ప్రకాశ్ సవాల్‌ను ఆమె స్వీకరించాలని, రోజా చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని రవి నాయుడు అన్నారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం : సీఎం చంద్రబాబు
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల అంటే ఆగస్టు 15వ తేదీన నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఏ రాష్ట్రాలకు ఎంత భారం అనే అంశంపై చర్చించారు. ఉచిత ప్రయాణంతో లబ్ది, 100 శాతం రాయితీ వివరాలను మహిళలకు ఇచ్చే జీరో ఫేర్ టిక్కెట్‌లో పొందుపర్చాలన్నారు.
"ఈ పథకం ఆర్టీసీ భారంకాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలి. నిర్వహణ వ్యయం తగ్గింపుతో సంస్థను లాభాల బాట పట్టించాలి. లాభాల అర్జన విధానాలు, మార్గాలపై కార్యాచరణ రూపొందించాలి. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులో కొనుగోలు చేయాలి. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్‌గా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గిస్తుంది. ఇందుకోసం అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలి. అన్ని ఆర్టీసీ డిపోల్లో చార్జింగ్ స్టేషన్లపై ఏర్పాటుపై అధ్యయనం చేయాలి" అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.