కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

సెల్వి

సోమవారం, 21 జులై 2025 (19:54 IST)
woman
సూరత్‌లోని మంగ్రోల్ తాలూకాలోని పలోడ్ గ్రామ శివార్లలో ఉన్న పెట్రోల్ పంప్‌లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. పెట్రోల్ పంప్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని కారు నాలుగు చక్రాల కింద నలిగిపోయింది. ముందు కూర్చుని చెత్తను ఎత్తుతున్న మహిళపైకి కారు డ్రైవర్ అలానే బండిని పోనిచ్చాడు. ఈ సంఘటన మొత్తం పెట్రోల్ పంప్‌లో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలలో రికార్డైంది.
 
వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన NH-48లో పలోడ్ గ్రామ సరిహద్దుల్లోని పెట్రోల్ పంపు వద్ద జరిగింది. బాధితురాలు, 35 ఏళ్ల సంగీతాబెన్ భరత్‌భాయ్ ఠాకూర్, వ్యర్థాలను సేకరిస్తుండగా, హ్యుందాయ్ క్రెటా డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ, ఆమెను వెనుక నుండి ఢీకొట్టి, కారును ఆమెపైకి పోనిచ్చాడు. కానీ ఈ ఘటనలో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. కానీ చీలమండ దగ్గర ఆమె కుడి కాలికి గాయాలైనాయి. 
 
ప్రమాదం జరిగిన వెంటనే, పెట్రోల్ పంపు వద్ద ఉన్న ఇతర ఉద్యోగులు ఆమెకు సహాయం చేయడానికి పరుగెత్తారు. సీసీటీవీ ఫుటేజ్‌లో మహిళ చెత్తను సేకరిస్తున్నట్లు, కారు వెనుక నుండి ఆమెను ఢీకొట్టడం, పెట్రోల్ పంపు సిబ్బంది అతన్ని పట్టుకునే ప్రయత్నంలో అతనిని వెంబడిస్తున్నప్పటికీ డ్రైవర్ వేగంగా పారిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. 
Car
 
ఈ సంఘటన తర్వాత, సంగీతాబెన్ కుటుంబం కోసాంబా పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదును నమోదు చేశారు. CCTV ఫుటేజ్‌లను ఉపయోగించి పరారీలో ఉన్న డ్రైవర్‌ను గుర్తించి అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. 

Watch | Car driver flees after running over woman at petrol pump in Surat villagehttps://t.co/riJynLYbDv pic.twitter.com/9D3lIEgETB

— DeshGujarat (@DeshGujarat) July 21, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు