విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ఏంటది?

ఆదివారం, 5 నవంబరు 2017 (10:31 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. రాజ్‌కోట్‌లో శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 65 పరుగులు చేసిన కోహ్లీ టీ20లలో ఏడు వేల పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఖ్యాతిగడించాడు. 212వ టీ20 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం ద్వారా అత్యంత వేగవంతంగా 7 వేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్ అయ్యాడు.
 
కోహ్లీ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ 192 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు, టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 309 మ్యాచ్‌లు ఆడిన గేల్ 10,571 పరుగులతో ఎవరూ ఇప్పట్లో అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు