WTC final reserve day: డ్రా అయితే బాగుండు.. సచిన్‌తో పాటు మాజీ స్టార్స్ కూడా..?

బుధవారం, 23 జూన్ 2021 (17:24 IST)
Team India
మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్.. విన్నర్ ఎవరో తెలియకుండా.. డ్రాగా ముగియకూడదని కోరుకుంటోన్నారు మాజీ క్రికెటర్లు. థ్రిల్లింగ్ క్లైమాక్స్ ఉండాలని ఆశిస్తున్నారు వారు ఆశిస్తున్నారు. ఇలా ఆశించే వారిలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. వారి అంచనాలకు అనుగుణంగా ఈ మ్యాచ్‌లో అద్భుతం జరుగుతుందా? లేదా? అనేది టీమిండియా బ్యాట్స్‌మెన్లు, బౌలర్ల మీద ఆధారపడి ఉంది. 
 
ప్రస్తుతం రెండో ఇన్నింగ్ ఆడుతోన్న కోహ్లీ సేన తొలి రెండు సెషన్లలో దూకుడుగా ఆడి, ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించినా-న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టడానికి వీలు ఉంటుందని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బ్యాట్స్‌మెన్లు ఓ మోస్తరు స్కోర్ చేసినా.. తమ పని తాము చేసుకుంటామని చెప్పాడు.
 
ఇకపోతే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్.. మరో అరుదైన ఘనతను అందుకుంది. ఆరు రోజుల పాటు సాగిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. రిజర్వ్ డేను కూడా కలుపుకొంటే మొత్తంగా ఆరు రోజుల పాటు ఈ టెస్ట్ మ్యాచ్ సాగినట్టవుతుంది. ఆధునిక టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి సందర్భం దాదాపుగా లేదనే అనుకోవచ్చు. అలాంటి మ్యాచ్ ఫలితం తేలకుండా పోవడానికే అవకాశాలు ఉండటం క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు