ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final)కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ శుక్రవారం ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సౌథాంప్టన్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్ష గండం పొంచివుంది.